నేడు కీ.శే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి 133వ జయంతి సందర్భంగా వారిని గుర్తుచేసుకుందాం. బాబూరాజేంద్ర ప్రసాద్ డిసెంబరు 3వ తేదీన 1884లో కమలేశ్వరీదేవి, మహదేవ్ సహాయ్ గార్లకు బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లా లోని జిర్దేయి గ్రామంలో జన్మించాడు.
12వ యేట పెండ్లి చేసుకుని, కలకత్తాలో ఎం.ఏ., ఎం.యల్. చదివి డాక్టరేటు పొందాడు. బీహారు, ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదిగా పనిచేశాడు. సర్చలైట్, దేశ్ అనే పత్రికలు నడిపాడు. బీహారులో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సహాయపడేవాడు. 1934లో బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ జైలులో ఉన్నాడు. అతని సేవాతత్పరతను గురించి బాగా తెలిసిన పాలకులు అతణ్ణి జైలునుండి విడుదల చేశారు. భూకంప బాధితులకోసం 38లక్షల రూపాయలు వసూలు చేశాడు.
స్వాతంత్ర్యము వచ్చిన తరువాత రాజేంద్రప్రసాద్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1962వరకూ పనిచేసాడు. 1963లో చనిపోయాడు. తరువాత ఆయనకు భారతరత్న పురస్కారము ప్రకటించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి