తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు 1923 నవంబరు 16వ తేదీన సీతారావమ్మ, కేశవరావులకు నల్గొండ జిల్లా కోదాడ వద్ద గల గుదిబండ గ్రామంలో జన్మించారు.
కాంతారావుగారు 8వ తరగతి వరకు ఉర్ధూ మీడియంలో చదువుకున్నారు. వారి తండ్రిగారు చనిపోయినందున వారి తండ్రి గారి మున్సబు ఉద్యోగం వీరికి ఇచ్చారు. వీరికి దాదాపు 600 ఎకరాల భూమి వుంది. ఈయన ఒక్కడే కొడుకు. రాజకుమారునిలాగా పెరిగాడు. వీరికి నాటకాలంటే చాలా ఇష్టం . వాళ్ళ ఊరిలోకి సురభి నాటకాలవాళ్ళు వచ్చినప్పుడు ఈయన వాళ్ళతో కలసి వెళ్ళిపోయాడు. దాదాపు మూడునాలుగు నెలల తర్వాత వీరి బంధువులు వెళ్ళి బ్రతిమాలి తెచ్చారు. ఇలా అయితే లాభంలేదని 17 సంవత్సరాల వయస్సులో పెండ్లి చేశారు. వీరికి ఒక పాప పుట్టి ఐదారు నెలలకే చనిపోయింది. 22యేళ్ళ వయసులో ఒక అబ్బాయి పుట్టాడు. అప్పటి పరిస్థితుల వల్ల కోదాడ నుండి జగ్గయ్యపేట వెళ్ళారు. అక్కడ ఒక కుటుంబంతో పరిచయం అయింది. కాంతారావు గారి భార్య ఆరోగ్యం బాగుండనందున ఆ కుటుంబంలోని అమ్మాయిని కాంతారావు గారికి ఇచ్చి పెండ్లి చేయాలని కాంతారావుగారి భార్య అడిగినందున వారు అలాగేనని వారి అమ్మాయిని కాంతారావు గారికి ఇచ్చి పెండ్లి చేశారు. కొన్నాళ్ళకు మొదటి భార్య చనిపోయింది.
కాంతారావు గారు ఏపనీ చెయకుండా విజయవాడ వెళ్ళ రెండు మూడు రోజులుండి సినిమాలు చూడడం జరుగుతుంది. వారి తల్లిగారు ఏదైనా పని చేయమని కాంతారావు గారిని అడుగుతూ వుండేది. జగ్గయ్యపేటలో మాస్టర్ విశ్వం అని వొకతను ఉండేవాడు . ఆతను తరుచూ మద్రాసు వెళ్ళి వస్తుంటాడు. బాలనాగమ్మ సినిమాలో బాలవర్ధిరాజుగా నటించాడు. అతడు చెప్పే సినిమా కబుర్లు విని సినిమాలలో నటించాలనే కోరిక కలిగింది. 1950 అక్టోబరు నెలలో మద్రాసు వెళ్ళి సినిమాలలో నటిస్తానని చెప్పి మద్రాసు వెళ్ళి తన బంధువు ఇంటిలో కొన్నాళ్ళున్నాడు. అక్కడ కృష్ణమాచారి అని రాజకీయ నాయకుడు హయగ్రీవాచారి గారి మేనల్లుడు పరిచయమైతే అతని గదికి మకాం మార్చాడు. కృష్ణమాచారి తన పేరును T.కృష్ణ గా మార్చుకున్నాడు. ఆయన అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన నాటకాలు వేస్తుండేవాడు వాటిలో కాంతారావు గారు కూడా నటించేవాడు. హిందీ నాటకాలలోకూడ కాంతారావుగారు నటించారు. ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నందున హిందీ బాగావచ్చు. ఎన్నాళ్ళు మద్రాసులో ఉన్నా సినిమాలలో నటించడానికి అవకాశం రాలేదు. కాంతారావుగారు నిరాశపడి ఇక ఇంటికి వెళ్ళి పోవాలని అనుకున్నాడు. కానీ కృష్ణమాచారి ఏమన్నారంటే ఏదైనా చిన్నా వేషమైనా ఓ సినిమా లో చేసి ఇంటికి వెళితే కొంత తృప్తిగా వుంటుందని, తాను పనిచేసే సంస్థలో ఏదైనా చిన్న వేషం ఇప్పిస్తానని చెప్పారు.
తెలుగులో మొదటి టాకీ సినిమా అయిన భక్తప్రహ్లాద దర్శకుడు హెచ్చెం రెడ్డిగారివద్ద టి.కృష్ణగారు పనిచేస్తున్నారు. అప్పుడు హెచ్చం రెడ్డిగారు నిర్దోషి అనే సినిమా తీస్తున్నారు. విలన్ వేషాలు వేసే ముక్కామల గారిని నిర్దోషిలో హీరోగా పెట్టారు. అప్పటివరకూ సినిమాలలో వేంపు పాత్రలు వేస్తున్న అంజలీదేవిగార్ని హీరోయిన్ గా తీసుకున్నారు. పైగా ఆమెకు ద్విపాత్రాభినయం కూడా. ఈ సినిమాలో విలన్ గా వేసింది కూన ప్రభాకర్ గారు. ఆ తర్వత ఆయన రాజకీయాల్లో చేసి మహారాష్ట్ర గవర్నరుగా కూడ పనిచేశారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోకూడా సమాంతరంగా నిరపరాధి అనే పేరుతో తీస్తున్నారు. తమిళంలో హీరో హీరోయిన్లుగా ముక్కామల, అంజలీదేవిగార్లే. తమిళంలో ముక్కామలగారికి డబ్బింగు చెప్పినది శివాజీగణేషన్ గారు. అప్పుడాయన తమిళంలో సినిమాలలో నటించడానికి చాలాకాలంగా ప్రయత్నం చేస్తు అవకాశాలేవీ దొరకని యువకుడు.
ఇక కాంతారావు గారి విషయానికి వస్తే ఆ నిర్దోషి సినిమాలో హీరోగారు హీరోయిన్ ని ఇంట్లోనుంచి వెళ్ళగొడతాడు. అప్పుడు హీరోయిన్ తండ్రి వచ్చి హీరోకి నచ్చజెప్పబోగా ఆయన వినిపించుకోడు. అప్పుడు హీరోయిన్ తండ్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొందరు గ్రామస్తులు ఆయన్నుహేళన చేస్తారు. ఆ హేళన చేసే గ్రామస్తులలో ఒకరి పాత్రను కాంతారావుగారిచేత చేయించాలని టి.కృష్ణగారి ప్రయత్నం. అయితే హెచ్చెం రెడ్డి గారి బంధువు ఒకాయన పల్లెటూరి వ్యక్తుల మెకప్ వేసుకున్న వారిలోనుంచి కాంతారావుగారిని ప్రక్కకు లాగి ఈయన బాగా చదువుకున్నవాని లాగా వున్నాడు పల్లెటూరివానిలాగాలేడని బయటికి వెళ్ళిపొమ్మన్నాడు. కాంతారావుగారు టికృష్ణగారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. అప్పుడు టి.కృష్ణగారు ఆ మీసాలాయన దగ్గరకు వెళ్లి చెప్పమని అన్నాడు. హెచ్చెంరెడ్డి గారితో తాను సినిమాలలో వేషంకోసం వచ్చానని కాని ఆ వ్యక్తి తనను వెళ్ళిపొమ్మంటున్నాడని చెప్పాడు. అప్పుడు హెచ్చంరెడ్డి కాంతారావుగారిలో ఏంచూశాడోగాని వెళ్ళి నటించమని చెప్పాడు. కాంతారావుగారు తనకిచ్చిన ఒక్క డైలాగుని ధైర్యంగా చెప్పాడు. హెచ్చంరెడ్డిగారికి అదినచ్చింది. వెంటనే రైటర్ని పిలిచి ఇతనికి మరో నాలుగు డైలాగులు వ్రాయమని వ్రాయించి నటించమన్నాడు. కాంతారావుగారు నటించారు. కెమేరా మేన్ని పిలిచి ఈ కుర్రవాడు ఎలావున్నాడని అడిగితే ఇతనిది ఫొటోజనిక్ ఫేసని బాగుందని చెప్పాడు. సౌండు ఇంజనీరుని పిలిచి ఇతని స్వరం ఎలావుందని అడిగితే బాగుందని చెప్పాడు. షూటింగు అయిపోయిన తర్వాత ఎక్స్ ట్రాయాక్టర్లసప్లయర్ నిపిలిచి ఇతనికి కేరెక్టర్లు ఇవ్వబాకమని చెప్పాడు. ఆయన ఈయన్ని నేనుతేలేదుసార్ టి.కృష్ణగారు తెచ్చారనిచెప్పారు. ఆయన టి.కృష్ణగారిని పిలిచి అదేచెప్పారు. ఎందుకంటే ఈ సినిమా అయ్యాక ఇతనిని హీరోగాపెట్టి నేను కొత్త సినిమా చేస్తానని అన్నాడు.అదే ప్రతిజ్ఞ సినిమా. హీరోయిన్ గా సావిత్రి, విలన్ గా రాజనాల నటించారు. విఠలాచార్యగారితో అనేక జానపద చిత్రాలు, నారదునిపాత్రద్వారా మంచిపేరు రావడం, యంటీరామారావుగారితో స్నేహం వల్ల అనేక చిత్రాల్లో నటించారు.
1969లో సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమజీవులు, గుండెలుతీసినమొనగాడు అనే సినిమాలు తీసి పూర్తిగా నష్టపోయి ఇల్లుకూడా అమ్ముకొని హైదరాబాదులో ఓ అద్దెఇంటిలో ఉంటూ టీవీ సీరియళ్ళలో నటించారు.
తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది.వీరి స్వీయ చరిత్ర “అనగనగా ఒక రాకుమారుడు”.ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు.లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్రని విశేషంగా పోషించినందుకు గాను కాంతరావు గారు 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు.
4 సంవత్సరాలపాటు సూపర్ స్ఠార్ రజనీకాంత్ గారు నెలనెలా రు.5000/-పంపారు.
దాసరి నారాయణరావు గారు నెలకు రు.5000/-చొప్పున 9 సంవత్సరాలు పంపారు.
టి.సుబ్బిరామిరెడ్డి గారు కాంతారావు గారికి ఘన సన్మానం చేసి పది లక్షలు ఇచ్చారు.
కేన్సర్ వ్యాధితో మార్చి22వతేదీ 2009న చనిపోయారు.
https://www.youtube.com/watch?v=xBT0D9uE-dk
https://www.youtube.com/watch?v=uHwvBX0t2Lk
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి