రొంపిచర్ల మండలం కర్లకుంట లైబ్రరీ వద్దనున్న M.P.P.Schoolలో కందుకూరి వీరేశలింగం గారి జయంతిని పురస్కరించుకొని ఒక సమావేశము ఏర్పాటు చేయబడింది. పాఠశాల LFL Head Master శ్రీ అమినిగడ్డ గురులింగం గారు కందుకూరి వీరేశలింగం గారి జీవితచరిత్రను విద్యార్ధులకు వివరించారు. మొదటగా N.M.C.Chairman అయిన శ్రీ లింగా హనుమంతరావుగారు మరియు ప్రధానోపాధ్యాయుడు గురులింగం గార్లు కందుకూరి వీరేశలింగంగారి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరి వీరేశలింగంగారి పుట్టిన రోజును తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగిన విషయమని పేర్కొ్నారు.
ఈ సందర్భంగా నర్సరావుపేటలో రాష్ట్ర స్థాయి ,జిల్లా స్థాయిలలో కళాకారులను గుర్తించి వారిని సన్మానించడం ముఖ్యంగా చిలకలూరిపేటనుండి ప్రఖ్యాత రంగస్థల దర్శకుడు నటుడు అయిన శ్రీ ఇందుపల్లి రాజకుమార్ LFL Head Master గారిని రాష్ట్ర స్థాయి ఉత్తమ కళాకారునికా ప్రకటించి సన్మానించడం ముదావహమని కీర్తించారు.
అలాగే ప్రజానాట్యమండలి కళాకారుడైన శ్రీ సి.ఆర్.మోహన్ గారిని జిల్లాస్థాయి ఉత్తమ కళాకారునిగా గుర్తించి సన్మానించుట గుంటూరు జిల్లాకే గర్వకారణమని ప్రస్తుతించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి