నాదెండ్ల మండలం లోని అన్ని గ్రామాలలో ఓటర్ల జాబితాలు ప్రకటించనున్నారు. అభ్యంతరాలు ఏవైనా ఉంటే సదరు కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి.
సాయంత్రం 5గం.లకు కనపర్రు బాలయేసు దేవాలయంలో దివ్యబలిపూజను బిషప్ గాలిబాలి సమర్పిస్తారు.
నాదెండ్ల మండలం లోని అన్ని గ్రామాలలో నేటినుంచి విద్యుత్ కోతను ఎత్తివేస్తామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు.
నాదెండ్ల ఎం.ఆర్.ఓ. గా వెంకటసుబ్బారావు నియమించబడ్డారు.
నాదెండ్లనుండి తూబాడు వెళ్తున్న ఆటో కాలువలో పడి ఐదుగురికి గాయాలయ్యాయి.
గ్రామసేవకులు డిఏ, జీతం పెంపు మొదలగు కోరికల సాధనకోసం ఎంఆర్ వో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పొలకటి ఆనందరావు, వెంకయ్య,గోపాలరావు, మరియమ్మ , సువార్తమ్మ, ఎలీషా ,దేవదాసు మొదలగువారు పాల్గన్నారు.
గణపవరం లో టైలర్ గా పనిచేస్తున్న షేక్.హసన్, జైనాబీల కుమారుడు షేక్.మహమ్మద్ అన్వర్ చిలకలూరిపైటలోని మోడరన్ కాలేజిలో చదివి ఇంటర్ ఎం.పి.సి. గ్రూపులో 969 మార్కులు సాధించినందుకు చిలకలూరిపేట ఎం.ఆర్.ఓ. అన్వర్ ను అభినందించాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి