జగనన్నను గత అసెంబ్లీలో అధికారపక్షం ప్రతి విషయంలోనూ అవమానపరచింది. సభలో మాట్లాడనివ్వలేదు. అధికారపక్షం చేస్తున్న తప్పులను ఎత్తిచూపనివ్వలేదు. ఇక తప్పని పరిస్థితులలో జగనన్న అసెంబ్లీని విడిచి కాలినడకన రాష్ట్రమంతా పర్యటించి అధికారపక్షం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించాడు. ప్రజలు జగన్ బాబు చెప్పిన మాటలు విని ఆయనను అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు.
అయినప్పటికీ జగనన్న అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామన్నా చెయ్యనివ్వకుండా వ్యవస్ధల అండతో ప్రతిపక్షం నేటికీ ఆటంకాలు కలిగిస్తుంది. కేంద్రప్రభుత్వం తాను చెయ్యవలసిన పనులకు బదులుగా ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సహకారం ఇవ్వడంలేదు. మన రాష్టానికి రావలసిన విభజన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది. పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు సక్రమంగా ఇవ్వడంలేదు. పార్లమెంటు లో మన ఎంపీలు ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు.
కనుక ఈసారి జగనన్న పార్లమెంటులోని అన్ని స్థానాలకు వైయ్యస్సార్సిపీ తరఫున పోటీకి నిలుపుతూ ప్రచారం చేయడంద్వారా విజయాన్ని సాధించగలడని నా నమ్మకం. దేశంలోని ప్రతి నగరంలోనూ రోడ్ షో నిర్వహిస్తూ బహిరంగ సభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని సమీకరించాలి.
ప్రస్తుతం మోడీ గారి పాలనపై ప్రజలకు ఆశలు లేవు. కనీసం ఎన్నికల వాగ్దానాలను కూడా అమలు చేయడం లేదు. ప్రతి పేదవానికీ 15లక్షలు ఇస్తాననే వాగ్దానం నెరవేర్చలేదు. వైరస్ సోకిన పార్లమెంటు సభ్యుణ్ణి తొలగించమని ఏడాదిగా మనం ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అలాగే రైల్వేజోను వంటి ఇతర హామీలు కూడా నెరవేర్చలేదు. కేవలం ఆక్రమిత కాశ్మీరు పై బాంబులు వేయడం వల్ల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల అధికారాన్ని గుప్పిటబట్టాడు అని ఆయనపై అభియోగాలున్నాయి. ఇటువంటి జిమ్మిక్కులు ఎల్లకాలం పనిచేయవు. దేశప్రజల దృష్టి జగనన్న పై ఉంది.
న్యాయవ్యవస్ధలో తీర్పులు ఇవ్వడంలో జరిగే జాప్యం వల్ల ప్రజలు ఆనేక ఇబ్బందులు పడుతున్నారు. పేదలకోసం, రైతులకోసం పనిచేసే నాయకత్వం అవసరం. బీజేపీఏతర రాష్టాలకు కేంద్రానికీ మధ్య పొరపొచ్చాలు లేని పాలనకోసం, న్యాయవ్యవస్ధ బలోపేతం కోసం, రైతుల కోరికలు తీర్చడం కోసం, దేశంలోని వివిధ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, దేశాభివృద్ధి అనుకున్నవిధంగా జరగడానికి నిజాయితీ పరుడైన నాయకుడు అవసరం. ఈ సమయంలో జగనన్న పూనుకోకపోతే ప్రజలకు అభివృద్ధి లేదు.
కనుక వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభకు పోటీ చేసి కేంద్రంలో అధికారాన్ని పొందడానికి సిద్ధపడాలని నా ఆకాంక్ష.
జై జగన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి