
ఈ రోజు సినీ నిర్మాత కీ.శే.బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి పుట్టినరోజు. వీరు డిసెంబరు 2 న 1912వ సంవత్సరంలో కడపజిల్లా సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె అనే గ్రామంలో పుట్టారు.
చెన్నైలో పాఠశాల విద్య నేర్చుకున్నాడు. తమ కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టాడు. నాగిరెడ్డిగారి అన్న గారైన బి.యన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వారి ఓడలు ఫిరంగుల దాడిలో ధ్వంసం కావడంతో వ్యాపారంలో నష్టపోయి స్వగ్రామం చేరుకున్నాడు. కే.వి.రెడ్డి గారు నాగిరెడ్డిని మద్రాసు పిలిపించి తాను దర్శకత్వం వహిస్తున్న భక్తపోతనకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు.
తర్వాత 1950లో నిర్మాతగామారి చక్రపాణితో కలసి విజయా ప్రొడక్షన్ స్థాపించాడు. షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కధ, సి.ఐ.డి., జగదేకవీరుని కధ, సత్య హరిశ్చంద్ర, ఉమాచండీగౌరీ శంకరుల కధ, గంగ-మంగ, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, విజయ వంటి సినిమాలు తీశాడు. తెలుగులోనేగాక తమిళం, కన్నడం, హిందీ, సింహళి భాషలలో సినిమాలు తీశాడు. నాగిరెడ్డిగారు తమిళంలో తీసిన గుండమ్మకధ, ఎంగవీట్టు పిళ్ళై సినిమాలకు దర్శకత్వం వహించాడు.
వీరు ఆంధ్రజ్యోతి అనే పత్రికను నడిపాడు. చందమామ అనే పిల్లల కథల మాసపత్రికను నడిపాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి