
1984 డిసెంబరు 2వ తేదీన మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణమైన భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్ ఐసోసైనేట్ (మిక్) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది.
కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్ 1984 డిసెంబరులో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.
వై.పి.గోఖలే అనే యూనియన్ కార్బైడ్ ఆఫ్ ఇండియా మానేజింగు డైరెక్టరు చెప్పినట్లుగా మెధైల్ గ్యాసును భూగర్భంలో నిలువచేసిన గ్యాసు టాంకు వాల్వు వత్తిడి కారణంగా పగిలి గ్యాసు లీకైనది. మూడు మైళ్ళ దూరంలో ఉన్న భోపాల్ నగరంలోని మురికివాడలలో నివసించే 9లక్షల మంది ప్రజలపై దాని ప్రభావం ఎక్కువగా పడింది. 20వేలమందికి పైగా ఆసుపత్రిలో చేర్చబడ్డారు. వేలాదిగా చచ్చిన పిల్లులు, కుక్కలు, ఆవులు, పక్షులతో వీధులు నిండిపోయాయి. భోపాల్ నివాసి అహ్మద్ ఖాన్ ఏమన్నారంటే తాము ఉక్కిరిబిక్కిరి అయ్యామని, సైరన్ మోత వినిపిస్తుండగా పొగలు కమ్మిన రోడ్డును చూడాలంటే కళ్ళు మండుతున్నాయని , మాకు ఎటు పరుగెత్తాలో అర్ధం కాలేదని, అందరం కన్ ఫ్యూజ్ అయ్యామని , తమ బిడ్డలు చనిపోయిన విషయం తల్లులకు తెలీదని, తమ తల్లులు చనిపోయిన విషయం తమ బిడ్డలకు తెలీదని, తమ కుటుంబసభ్యులు చనిపోయిన విషయం కుటుంబ యజమానికి తెలీదని అన్నారు.
యూనియన్ కార్బిడ్ ఫ్యాక్టరీని వెంటనే మూయించి, ఆ కంపెనీ సీనియర్ ఉద్యోగులను అరెష్టు చేశారు. ప్రభుత్వము న్యాయవిచారణ కమిటీని నియమించింది. ప్రపంచ పారిశ్రామిక ప్రమాదాలలో ఇదే పెద్దది. దాదాపు 3వేలమంది చనిపోయారు. దాదాపు 50వేలమంది ప్రజలు కంటిచూపుపోవడం, కిడ్నీలు లివర్లు పాడవడం వంటి ప్రమాదాలతో బాధలు పడ్డారు. దాని ప్రభావం వల్ల తరువాత 20వేలమంది చనిపోయారు.
1989లో యూనియన్ కార్బైడ్ కంపెనీ భారత ప్రభుత్వానికి 470 మిలియన్ పౌండ్లు చెల్లించింది. 1999లో ఒక వాలెంటరీ సంస్థ అమెరికాలో కార్బైడ్ సంస్థ బాధితులను తగిన విధంగా ఆదుకోలేదనీ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందనీ, మానవ హక్కులను ఉల్లంఘించిందని కేసు వేసింది. 2004లో ఇండియన్ సుప్రీం కోర్డు ఐదులక్షల డెబ్బైవేలమంది బాధితులకు 35 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా అంగీకరించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి