సామాన్య దళిత కుటుంబంలో పుట్టి సేవ, రాజకీయ రంగాల్లో కృషిచేసిన ప్రముఖ సంఘసేవకురాలు, అంబేద్కర్ ఆశయవాది, మెజిస్ట్రేట్, శాసన సభ్యురాలిగా సేవలందించిన జెట్టి ఈశ్వరీబాయి జయంతి నేడు.
జెట్టి ఈశ్వరీబాయి డిసెంబరు 1,1918లో రాములమ్మ, బల్లెపు బలరామస్వామి దంపతులకు ఒక మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యను చదువుకున్నారు. తన 13వ ఏట పూనా లోని ఒక దంతవైద్యుడైన జెట్టి లక్ష్మీనారాయణను పెండ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కూతురు (జె.గీతారెడ్డి మాజీ మంత్రి) పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. ఈశ్వరీబాయి హైదారాబాదులోని తన పుట్టింటికి వచ్చి ఉపాధ్యాయినిగా, ప్రజానాయకురాలిగా పనిచేసింది.
ఈశ్వరీబాయికి తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి పరిజ్ఞానముంది. తాను స్వంతగా గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు నడిపింది. 1951లో జరిగిన తొలి ఎన్నికలలో చిలకలగూడా వార్డు మెంబరుగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. పురపాలక కౌన్సిలర్ గా రెండు సార్లు పనిచేసింది. షెడ్యూలు కులాల ఫెడరేషన్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1967లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా పనిచేసింది. సపరేట్ తెలంగాణా పోరాట సమితి అనే పార్టీని స్థాపించింది.
పది సంవత్సరాలపాటు శాసన సభలో ముఖ్యనాయకురాలిగా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించటంలో కీలక పాత్ర వహించారు. హిందూ సమాజంలోని సాంఘిక దురాచారాలపై పోరాటం చేసారు. స్త్రీలు, పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని, పురుషుడితో పాటు సమాన హోదా దక్కాలని కృషి చేశారు. ఆత్మాభిమానం, ధైర్యసాహసాలు కలిగిన దళిత ధీర వనిత ఈశ్వరీభాయి.కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా పనిచేసింది. 1952 నుండి 1990 వరకూ ప్రజాసేవ చేసి 1991లో చనిపోయింది. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలను గుర్తుతెచ్చుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి