శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన పై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు.
తమ నిరసనను ప్రజలకు తెలిపేందుకు విద్యార్ధులతో కలసి ఊరేగింపుగా చిలకలూరిపేటలో కలియదిరిగి జాతీయ
రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ను రెండుగా చీల్చి సోనియాగాంధీ తెలుగు వాళ్ళ చెవుల్లో
సీమాంధ్ర, తెలంగాణా అనే పూలు పెట్టిందని బాధపడుతూ తన అసంతృప్తిని
చెవులలో పూలు పెట్టుకొని వ్యక్తం చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధాయుడు
కృష్ణమూర్తి గారు.
కదంతొక్కుతూ వస్తున్న విద్యార్ధులూ , ఉపాధ్యాయులు.
ఊరేగింపులో విద్యార్ధులు ఎలా మెలగాలో సూచనలు ఇస్తున్న సెకెండ్ హెచ్చెం. రామిరెడ్డిగారు.
స్లోగన్స్ ఇస్తూ విద్యార్ధులను ఉత్సాహపరుస్తున్న పి.యి.టి. & NCC OFFICER ఇమాన్యుయేల్ గారు.
విద్యార్ధులకు సూచనలిస్తున్న వీర వసంతరావు గారు మరియు సామంతపూడి రమణ గారు
గడియారస్థంభం సెంటర్ లో వాలీబాల్ ఆడుతున్న విద్యార్ధులు , ఉపాధ్యాయులు
వాలీబాల్ ఆట
బందు చేయిస్తున్న వైయ్యస్సార్ సీపి కార్యకర్తలు
తెలుగు సమైక్యవాదులుగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న పౌరులు
నర్సరావుపేట సెంటర్లో నేషనల్ హైవే పై కబాడి ఆడుతున్న విద్యార్ధులు
విద్యార్ధుల విన్యాసాలు
---------------------------------------------------------------
పాఠశాలనుండి ప్రారంభమైన ఊరేగింపు
కళామందిర్ సెంటర్ లో విద్యార్ధులచే కో. ఆట
గడియారం సెంటర్ లో విద్యార్ధులు వాలీబాల్ ఆట ఆడారు.
వాలీబాల్ ఆట
Please don't use school children for political agitations.
రిప్లయితొలగించండితెలంగాణా ఉద్యమం నడిపిందే విద్యార్ధులు. మీరు చేస్తే మంచిది మరొకరు చేస్తే రాజకీయమా.
రిప్లయితొలగించండిజై గారూ, నిజమే పిల్లల్ని వాడకూడదు ఉద్యమాల్లో. వాళ్ల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు.
రిప్లయితొలగించండికానీ, తెలంగాణ బడుల్లో పంతుళ్ళు పిల్లలకు విషాలు అబద్ధాలూ నూరిపోసారే.. దానికంటే ఇది చాలా నయం. అది నేరం కూడా. ఆ నేరాన్ని మనందరం ఖండించాలి - ముఖ్యంగా మీవంటి పెద్దలు.
-----------------
అజిత్ కుమార్ గారూ, అప్పట్లో ’ఆ విద్యార్థులు విద్యార్థులు మాత్రమే కాదు, ఆ పేరుతో కొందరు రౌడీ అంకుల్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళే ఈ గొడవుద్యమం చేస్తున్నది’ అని కోస్తా సీమల వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో ఆ ఉద్యమం చేసింది విద్యార్థులు అని మీరు అంటే వాళ్లకు కష్టంగా ఉండదూ.. వాళ్ళ మనసులు గాయపడవూ..? అంచేత విద్యార్థులతో పాటు రౌడీలూ ఉన్నారని చెబుతే వాళ్ల మనోభావాలు గాయపడకుండా ఉంటై.
విద్యార్తులు రాజకీయాలలోకి రావొద్దని నేను అనలేదు. 18 ఏళ్ళలోపు బడి పిల్లలను బడి యాజమాన్యాలు తమ లబ్ది కోసం వాడడానికే నా అభ్యంతరం.
రిప్లయితొలగించండిఆంధ్రాలో పంతుళ్ళు నూరి పోయ్యడంలేదా మీరు మరీ విడ్డూరం మాట్లాడతారు!
రౌడీ అంకుల్సు విశాఖ ఆంద్ర విశ్వవిద్యాలయంలో లేరనా మీ వాదన? ఆడారి కిషోర్ గారిని ఒకసారి పరిశీలంచండి.
వాస్తవానికి స్కూలు టీచర్లంతా సమ్మెలో పాల్గొనలేకపొయ్యాం.కనీసం నిరసన ర్యాలీ జరపాలని అనుకున్నాం. మీరు రావద్దు ఇంటికి పోండి మేము ర్యాలీ చేయబోతున్నామంటే మా పిల్లలు వింటారా... వినరు. మేము కూడా వస్తామని మారాం చేస్తారు. లైన్ తప్పకుండా నడుస్తామని హామీలు ఇస్తారు. తప్పుతుందా. పైగా ఆరోజున విజయమ్మగారిని అంబులెన్సులో తీసుకుపోలేదని బందు కూడా జరిగింది. ఊళ్ళో ఓ రౌండ్ వేసి మధ్యాహ్న భోజన పధకం పూర్తి చేసుకొని డిస్పర్సయ్యాం. పిల్లలు లేకుండా మేం లేము . మమ్మల్నొదిలి పిల్లలుండలేరు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మద్రాసుకు మేం దూరమయ్యాం కానీ హైదరాబాద్ తో అత్మీయానుబంధం పెంచుకున్నాం. చాంక్ బండ్ , సాలార్జంగ్ మ్యూజియం, బిర్లామందిర్, గోల్కొండ,చార్మినార్, బుద్ధవిగ్రహం ఇవన్నీ ఇకపై మీవు కావు అని అంటుంటే హృదయం బరువెక్కిపోతుంది. ఆదాయాలు రాజకీయాలు మాకు అవసరం లేదు కానీ హైదరాబాద్, ఓరుగల్లు ఇకపై తెలుగు వాళ్ళవి కాదని ఎవరో మానుండి బలవంతంగా లాక్కుంటున్నట్లుంటుంది. ఉమ్మడి కుటుంబంలో రేగిన ఈ చిచ్చును ఆర్పేవాళ్ళు లేరా.
రిప్లయితొలగించండి