నాదెండ్ల మండలం కనుపర్రుబావివద్దనున్న బాలయేసు పుణ్యక్షేత్ర ఉత్సవంలో కేరళ ఫాదర్ సునీల్ క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ నెల 30న బిషప్ డాక్టర్ గాలిబాలి, సినీనటి,ఎంఎల్ ఏ జయసుధ పాల్గొంటారని విచారణ గురువులు పూదోట చిన్నయ్య స్వామివారు తెలిపారు. ఇర్లపాడు వారిచే కోలాట ప్రదర్శన , వడ్డేరం వారి తప్పెట నృత్యం జరుగుతాయని చెప్పారు.
-----------
యడ్లపాడు మండలం బోయపాలెంలో నాభిశిల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. జూన్ 17న నాభిశిల ప్రతిష్ఠించుతారు.
యడ్లపాడు మండలం కొత్తపాలెం కొండవీడు కొండలపై ఉన్న బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయ 31వ వార్షికోత్సవం జరిగింది.
సనా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేనెల 5వ తేదీన మద్దినగర్ లోని అరబిక్ మదరసాలో పేద ముస్లిం చిన్నారులకు సామూహిక వడుగులు ( సున్తీ ) నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ యూసఫ్ ఆలీ తెలిపారు.
సినీ నాటక రచయిత గంధం నాగరాజు మృతి ఆయారంగాలకు తీరని లోటని గుంటూరు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ పి.వి. సుబ్బారావు నరసరావుపేటలోని ఆయన భౌతిక కాయాన్ని దర్శించి వారికి శ్రద్ధాంజలి ఘటించి తెలిపారు.
---------
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి