ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది
నాదెండ్ల మండలం లోని అన్ని గ్రామాలలో ఓటర్ల జాబితాలు ప్రకటించనున్నారు. అభ్యంతరాలు ఏవైనా ఉంటే సదరు కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. సాయంత్రం 5గం.లకు కనపర్రు బాలయేసు దేవాలయంలో దివ్యబలిపూజను బిషప్ గాలిబాలి సమర్పిస్తారు. నాదెండ్ల మండలం లోని అన్ని గ్రామాలలో నేటినుంచి విద్యుత్ కోతను ఎత్తివేస్తామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. నాదెండ్ల ఎం.ఆర్.ఓ. గా వెంకటసుబ్బారావు నియమించబడ్డారు. నాదెండ్లనుండి తూబాడు వెళ్తున్న ఆటో కాలువలో పడి ఐదుగురికి గాయాలయ్యాయి.  గ్రామసేవకులు డిఏ, జీతం పెంపు మొదలగు కోరికల సాధనకోసం ఎంఆర్ వో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పొలకటి ఆనందరావు, వెంకయ్య,గోపాలరావు, మరియమ్మ , సువార్తమ్మ, ఎలీషా ,దేవదాసు మొదలగువారు పాల్గన్నారు.  గణపవరం లో టైలర్ గా పనిచేస్తున్న షేక్.హసన్, జైనాబీల కుమారుడు షేక్.మహమ్మద్ అన్వర్ చిలకలూరిపైటలోని మోడరన్ కాలేజిలో చదివి ఇంటర్ ఎం.పి.సి. గ్రూపులో 969 మార్కులు సాధించినందుకు చిలకలూరిపేట ఎం.ఆర్.ఓ. అన్వర్ ను అభినందించాడు. 

క్రీస్తు సందేశం

నాదెండ్ల మండలం కనుపర్రుబావివద్దనున్న బాలయేసు పుణ్యక్షేత్ర ఉత్సవంలో కేరళ ఫాదర్ సునీల్ క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ నెల 30న బిషప్ డాక్టర్ గాలిబాలి, సినీనటి,ఎంఎల్ ఏ జయసుధ పాల్గొంటారని విచారణ గురువులు పూదోట చిన్నయ్య స్వామివారు తెలిపారు.   ఇర్లపాడు వారిచే కోలాట ప్రదర్శన , వడ్డేరం వారి తప్పెట నృత్యం జరుగుతాయని చెప్పారు. ----------- యడ్లపాడు మండలం బోయపాలెంలో నాభిశిల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. జూన్ 17న నాభిశిల ప్రతిష్ఠించుతారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం కొండవీడు కొండలపై ఉన్న బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయ 31వ వార్షికోత్సవం జరిగింది. సనా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేనెల 5వ తేదీన మద్దినగర్ లోని అరబిక్ మదరసాలో పేద ముస్లిం చిన్నారులకు సామూహిక వడుగులు ( సున్తీ ) నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ యూసఫ్ ఆలీ తెలిపారు. సినీ నాటక రచయిత గంధం నాగరాజు మృతి ఆయారంగాలకు తీరని లోటని   గుంటూరు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ పి.వి. సుబ్బారావు నరసరావుపేటలోని ఆయన భౌతిక కాయాన్ని దర్శించి వారికి శ్రద్ధాంజలి ఘటించి తెలిపారు. ---------

Good Friday News

కనుపర్రు చర్చి పండుగ

చిలకలూరిపేట, నరసరావుపేట మార్గమధ్యములో కనపర్రు బావి వద్ద ఉన్న   బాలయేసు దేవాలయంలో చర్చి పండుగ, స్వస్థత కూటాలు   నేడు అనగా గురువారం నుండి మూడు రోజులు   నిర్వహిస్తున్నట్లు   చర్చి ఫాదర్ పూదోట చిన్నయ్య తెలిపారు. 30వ తేదీన జరిగే గుడి పండుగకు ముఖ్య అతిధిగా బిషప్ గాలి బాలి స్వామి హాజరౌతారని తెలిపారు. -------- చిలకలూరిపేట మండలము లోని బొప్పూడి సమీపంలో ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి 28వ తిరునాళ్ళ గురువారం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖాధికారి పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం విద్యుత్ ప్రభలపే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

బియ్యార్ అంబేద్కర్ పండుగ నాటి సంగతులు

శ్రీరామ నవమి పందిర్లు 6

శానం.సుబ్బారావు తృతీయ వర్ధంతి సభ